గుంతకల్లు: భావితరాలు కూడా అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలి:గుత్తిలో టీడీపీ రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ను భావి తరాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకటశివుడు యాదవ్ అన్నారు. గుత్తిలోని అంబేడ్కర్ వద్ద మంగళవారం అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, ఎస్టీయూ, ఏపీటీఎఫ్ 1938, ఏపీటీఎఫ్, మాల ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకట శివుడు యాదవ్, ఎస్టీయూ మండల అధ్యక్షులు నారాయణస్వామిలు మాట్లాడారు. అంబేద్కర్ దేశానికి ఎనలేని సేవలు చేశారన్నారు.