నిర్మల్: నిర్మల్ కలెక్టరేట్ లో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు
Nirmal, Nirmal | Oct 22, 2026 నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో బహుజన సంక్షేమ పోరాట వీరుడు పండుగ సాయన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ మరియు ముదిరాజ్ సంఘ నాయకులు పాల్గొని సాయన్న చిత్రపటానికి నివాళులర్పించారు. ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించడంపై సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.