అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని మరూరు టోల్ గేట్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Apr 24, 2026
అనంతపురం నగర శివారులోని రాప్తాడు సమీపంలో ఉన్న మరూరు టోల్ గేట్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో సికేపల్లి మండలం ఎర్రదిన్నే గారి పల్లి గ్రామానికి చెందిన నాగేంద్ర తో పాటు నిశాంత్ అనే ఇద్దరికీ గాయాలయ్యాయి. గాయపడిన వారిని 103 నేషనల్ హైవే అథారిటీ వారి అంబులెన్స్ సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.