కోఠి ఉమెన్స్ కాలేజీని రాష్ట్ర మహిళా సంఘం ఛైర్పర్సన్ నేరెళ్ల శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. విశ్వవిద్యాలయంలో సరైన సెక్యూరిటీ లేదని, సినిమా షూటింగ్ సమయంలో ప్రైవేట్ సెక్యూరిటీ వేధింపులకు గురి చేశారని ఆరోపిస్తూ ఇటీవల విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలేజీని తనిఖీ చేశారు. ఈ విషయంపై స్టూడెంట్స్తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు