ఒంగోలు అర్బన్: ఒంగోలులో కారు ఢీకొని ఇద్దరు మృతి, మృతికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేయాలని నిరసనకు దిగిన బంధువులు
Ongole Urban, Prakasam | Jun 17, 2026
నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరు ప్రాణాలను బలి తీసుకున్న టంగుటూరు మండలానికి చెందిన టిడిపి నాయకుడిని వెంటనే అరెస్టు చేయాలని మృతుల బంధువులు డిమాండ్ చేశారు. బుధవారం ఒంగోలు పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి యువత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు మహిళల తాలూకు బంధువులు నిరసనకు దిగారు. మంగళవారం మంగమూరు రోడ్డులో కారు బీభత్సం సృష్టించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో పాటు పాదచారులను ఢీకొన్నింది. ఘటనలు ముగ్గురు గాయపడగా ఇద్దరు మృతి చెందారు