నంద్యాల అర్బన్: నంద్యాలలో మెగా అభిమానుల సందడి
Nandyal Urban, Nandyal | Jun 4, 2026
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన 'పెద్ద' సినిమా విడుదల సందర్భంగా నంద్యాలలో మెగా అభిమానులు సందడి చేశారు. థియేటర్ల వద్ద బాణాసంచా పేల్చి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రంతో అద్భుతమైన విజయాన్ని అందుకోబోతున్నారని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. థియేటర్ల వద్ద ఏర్పాటు చేసిన బాబాయ్, అబ్బాయిల కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.