నంద్యాల అర్బన్: మహానంది రెగ్యులర్ తహసిల్దారుగా రమాదేవి నియామకం
Nandyal Urban, Nandyal | Apr 8, 2026
నంద్యాల జిల్లా మహానంది రెగ్యులర్ తహశీల్దారుగా పి.రమాదేవిని నియమిస్తూ కలెక్టర్ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ తహశీల్దారుగా ఉన్న ఆమెకు తహశీల్దారుగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం మహానంది మండలంలో తాత్కాలిక తహశీల్దారుగా (FAC) పనిచేస్తున్న ఆమె.. పదోన్నతిపై రెగ్యులర్ తహశీల్దారుగా మండలంలో విధులు నిర్వహించనున్నారు.