అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని దంపతులకు గాయాలు
Anantapur Urban, Anantapur | May 7, 2026
అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డు లో ఉన్న ఎస్ ఎస్ ఎస్ బార్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో అనంతపురం నగరంలోని ఎర్రనేల కొట్టాలకు చెందిన లక్ష్మీదేవి కుల్లాయప్ప అనే దంపతులకు గాయాలయ్యాయి. వారు ఇరువురికి తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.