డోన్: బేతంచెర్ల లో ఉపయోగంలోకి రానున్న బోరుబావులు
Dhone, Nandyal | Jun 13, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్లలోని రేగుమానుపేట, వడ్డేపేట కాలనీల్లో గతంలో తవ్విన బోరుబావులు నిరుపయోగంగా ఉండగా, కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు నగర పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. నిరుపయోగంగా ఉన్న బోరుబావులకు తిరిగి డ్రిల్లింగ్ నిర్వహించగా నీరు లభించింది. దీంతో కాలనీలో నీటి సమస్య పరిష్కారం కానుంది.