నారాయణపేట్: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: హెచ్ సి కురుమన్న
నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు నారాయణపేట మండల పరిధిలోని అప్పక్ పల్లి గ్రామ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో 11:30 గం సమయంలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుళ్లు కురుమన్న, అశోక్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ తో పాటు సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైన సైబర్ నేరానికి గురైతే 1930 టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.