జహీరాబాద్: చిన్న హైదరాబాద్ గ్రామంలో పేకాట శిబిరం పై పోలీసుల దాడి, 11 మందిపై కేసు నమోదు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న హైదరాబాద్ గ్రామంలో పేకాట శిబిరంపై దాడి నిర్వహించి 11 మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న నమ్మదగిన సమాచారంతో శనివారం మధ్యాహ్నం దాడి నిర్వహించి 11 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద 40,150 రూపాయల నగదు, నాలుగు మోటార్ సైకిళ్లు 14 సెల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా పేకాట ఆడిన నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.