అసిఫాబాద్: న్యాయ సేవ కేంద్రాన్ని వయోవృద్ధులు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యువరాజా
న్యాయ సేవ కేంద్రాన్ని వయోవృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యువరాజు అన్నారు. ఆసిఫాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యాయ సేవల కేంద్రాన్ని ఆర్డీవో లోకేశ్వర్ రావుతో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు ట్రిబ్యునల్స్ ఎస్టాబ్లిష్డ్ అండర్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఆక్ట్ 2007 క్రింద వయోవృద్ధుల సంక్షేమం కోసం జిల్లాలో న్యాయ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని. వయవృద్ధులు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించేందుకు ఈ కేంద్రం ద్వారా కృషి చేయనున్నట్లు తెలిపారు.