ఉరవకొండ: వీధి కుక్కల దాడిలో ఏడాదిన్నర చిన్నారికి తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని ఎస్కే ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సోమవారం అంబేద్కర్ నగర్ కు చెందిన భువీస్ తన మామతో కలిసి ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులు వెంటనే వీధి కుక్కలను తరిమి చిన్నారిని కాపాడి ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్సలు అందించారు. అనంతరం మెరుగైన చికిత్సలకు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి చిన్నారిని తీసుకెళ్లారు.