తాడిపత్రి: పెదపపూర్ మండలం చాగల్లు గ్రామంలో విద్యుత్ ఘాతానికి గురై యువకుడు మృతి, కేసు నమోదు చేసుకున్న పోలీసులు
డిసెంబర్లో పెళ్లి జరగాల్సిన ఓ ఇంట్లో విషాదం నెలకొంది. రాబోయే కొత్త జీవితం కోసం కలలు కన్న రామును కోల్పోవడం కుటుంబానికి తట్టుకోలేని విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపప్పూరు(M) చాగల్లులో గ్రామానికి చెందిన రాము(23) గురువారం టెంకాయ చెట్టును కొడుతుండగా విద్యుత్తు వైర్లు తగిలి షాక్కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.