జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు నాలుగు రోజులపాటు చెకుముకి సంబరాలు కాకినాడలోని జేఎన్టీయూ యూనివర్సిటీలో నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక సీనియర్ నాయకుడు పుల్లారావు తెలియజేశారు జనవిజ్ఞాన వేదిక నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం చెకుముకి సంబరాల గోడపత్రికను ఒంగోలు నగరంలోని ఎల్బీజీ భవన్ లో ఆవిష్కరించారు ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక సీనియర్ నాయకుడు పుల్లారావు మాట్లాడుతూ శాస్త్రీయ సమాజ నిర్మాణం లక్ష్యంగా ఏర్పడిన జనవిజ్ఞానక వేదిక గడిచిన 35 సంవత్సరాలగా ఎన్నో రకాల సేవలు అందిస్తుందన్నారు మూఢనమ్మకాలను రూపుమాపి శాస్త్రీయ భావాలను పెంపొందించటమే కర్తవ్యం అన్నారు