నంద్యాల అర్బన్: మహానంది మండలంలో రోడ్డు ప్రమాదం, యువకుడు మృతి
Nandyal Urban, Nandyal | May 7, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలం బుక్కాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రామ్మోహన్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. స్థానిక చర్చి సమీపంలో ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో అబ్బీపురం గ్రామానికి చెందిన రవితేజ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.