గుంతకల్లు: గుత్తి పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థి ఎస్కే.యూనివర్సిటీ జట్టుకు ఎంపిక, విద్యార్థికి ఘనంగా సన్మానం
అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ రోడ్డులోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్.మహమ్మద్ ఆసిఫ్ అనే విద్యార్థి ఎస్కే. యూనివర్సిటీ ఫుట్బాల్ జట్టుకు ఎంపికయ్యాడు. గత రెండు రోజుల క్రితం గుంతకల్లు పట్టణంలో ఎస్ఎస్ జిఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఫుట్బాల్ పోటీలలో మహమ్మద్ ఆసిఫ్ ప్రతిభ కనబరచడంతో జిల్లా సెలెక్షన్ కమిటీ సభ్యులు ఎస్కే. యూనివర్సిటీ జట్టుకు ఎంపిక చేశారు. యూనివర్సిటీ జట్టుకు ఎంపిక కావడంతో కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్.వెంకటేశ్వర్లురెడ్డి సీఈఓ ఏ.శ్రీరాములు, పీఆర్ఆర్ ఎంబీఏ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్న కుమార్ అభినందించారు.