కర్నూలు: కర్నూల్ లో దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా దుకాణాల వద్ద ప్రజలతో కిటకిటలాడాయి
కర్నూలులో దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా దుకాణాల వద్ద ప్రజలు కిక్కిరిసిపోతున్నారు. సోమవారం ఉదయం 12 గంటలు కర్నూలు నగరంలోని ఎస్టీ బీసీ కళాశాల మైదానంలో 100కు పైగా క్రాకర్స్ దుకాణాలను ఏర్పాటు చేశారు. పండుగ సందర్భంగా బాణాసంచాలను కొనేందుకు నగర వాసులు పౄద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ దీపావళి పండుగ అందరిలో వెలుగు నింపి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు. పర్యావరణానికి హాని కలిగించకుండా శబ్ద కాలుష్యాన్ని తగ్గించి పండుగను జరుపుకోవాలని కొనేందుకు వచ్చిన వినియోగదారులు అంటున్నారు.