నంద్యాల అర్బన్: నంద్యాల పదవ తరగతి పరీక్ష ఫలితాలలో బాలికలది పై చేయి : జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి
Nandyal Urban, Nandyal | Apr 30, 2026
నంద్యాల జిల్లా పదో తరగతి ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. జిల్లాలో 24,529 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 84.73 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికలు 85.7 శాతం, బాలురు 82.18 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలే మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం. రాష్ట్రస్థాయిలో నంద్యాల జిల్లా 19వ స్థానంలో నిలిచిందని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.