కర్నూలు: కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి
కర్నూలులో అక్టోబర్ 24న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురికావడానికి కొన్ని నిమిషాల ముందు ఆ మార్గంలో రోడ్డుకు ఓ పక్కన శివశంకర్ మృతదేహం, మరో పక్కన అతడి బైక్ పడి ఉన్న దృశ్యాలు మరో బస్సులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కొన్ని బస్సులు ఆ బైక్ను తప్పించుకుని వెళ్లడం అందులో కనిపించింది. అదే బైక్ను కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొనగా, మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బస్సులో మంటలు చెలరేగిన దృశ్యాలు మరో సీసీ కెమెరాలో నమోదయ్యాయి.