డోన్: మద్దిలేటి స్వామి క్షేత్రంలో భారీ ట్రాఫిక్ జామ్
Dhone, Nandyal | May 9, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మద్దిలేటి నరసింహ స్వామి క్షేత్రంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శనివారం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. దీంతో వందలాది వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పోలీసులు, సహాయ సిబ్బంది లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.