ఒంగోలు అర్బన్: ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా ఉత్తమమార్గం : జిల్లా కలెక్టర్ రాజాబాబు
Ongole Urban, Prakasam | Jun 10, 2026
ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా ఉత్తమ మార్గమని జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుండే యోగ సాధన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో జరుగుతున్న యోగ సాధనలో భాగంగా బుధవారం సింగరాయకొండ మండలం పాకల బీచ్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ.నూకసాని బాలాజీ, జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి, సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ.బి.ఎన్. విజయ్ కుమార్ లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ పంచభూతాల సంగమ ప్రాంతంలో ఉత్సాహంగా వారు యోగ సాధన చేశారు.