గుంతకల్లు: ఉద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం, పట్టణంలోని విద్యుత్ ఏడీఈ కార్యాలయం వద్ద సీఐటీయూ నిరసన
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలన్నీంటినీ పరిష్కరిస్తామని ఊరించి ఊసూరుమనిపించి చివరకు మోసం చేసిందని సీఐటీయూ గుంతకల్లు పట్టణ ప్రధాన కార్యదర్శి సాకే నాగరాజు విమర్శించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ఆలూరు రోడ్డులో ఉన్న విద్యుత్ ఏడీఈ కార్యాలయం ఎదుట బుధవారం విద్యుత్ కార్మికులతో కలిసి సీఐటీయూ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ పట్టణ ప్రధాన కార్యదర్శి సాకే నాగరాజు మాట్లాడుతూ ఉద్యోగులకు దీపావళి బొనాంజా అంటూ హడావుడి చేసి కనీసం ఇవ్వాల్సిన డీఏ బకాయిలు, ఇతర బకాయిలు ఇవ్వకుండా కేవలం ఒక డీఏతోనే సరిపుచ్చడం సరైందికాదన్నారు.