మర్రిగూడ: మండల కేంద్రంలో నేటి నుండి ప్రారంభమైన రజకుల ఆరాధ్య దైవం శ్రీ మడవేలు సీతాళీ స్వామి బ్రహ్మోత్సవాలు
నల్గొండ జిల్లా, మర్రిగూడ మండల కేంద్రంలో రజకుల ఆరాధ్య దైవం శ్రీ మడవేలు సీతాళి స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రం ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నేటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా పురోహితుల వేద మంత్రాల మధ్య గణపతి పూజ, యజ్ఞ యాగాదులు, స్వామివారి కళ్యాణం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈనెల 18న బోనాలు, 19న ఆలయ ఉత్సవ విగ్రహాల పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.