కనిగిరి: మహిళలు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఫోటోలు తీసిన ఓ తాగుబోతును స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన సంఘటన కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సుల కోసం వేచి ఉన్న మహిళలు, బాలికల పట్ల ఓ తాగుబోతు అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వారి ఫోటోలను తీయడంతో స్థానికులు తాగుబోతును పట్టుకొని ధ్యాన శుద్ధి చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో తాగుబోతును అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.