ఆళ్లగడ్డ: చాగలమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన ఇద్దరికీ జైలు శిక్ష
నంద్యాల జిల్లా చాగలమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఇద్దరూ యువకులకు ఆళ్లగడ్డ స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ రవికుమార్ మూడు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు, అలాగే ఒక్కొక్కరికి 1000 రూపాయలు జరిమానా వేశారు, ఈనెల 8న ఎస్సై రాజారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో నాగళ్లపాడు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మద్యం మత్తుగా వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కారు