తాడిపత్రి: రాయలచెరువు గ్రామంలోని చెరువులో నీరు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పిన HLC SE సుధాకర్ రావు
యాడికి మండలం రాయల చెరువులోని చెరువులో ఎప్పుడూ నీళ్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్ఎల్సీ ఎస్ఈ సుధాకర్ రావు అన్నారు. యాడికి కాలువతో పాటు రాయలచెరువు చెరువును ఈఈ వెంకటేశ్వర్లు, డీఈలు, ఏఈలతో కలిసి ఆయన గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం చెరువులో నీరు సమృద్ధిగా ఉందన్నారు. ఇకనుంచి ప్రతి సంవత్సరం చెరువులో నీరు ఉండే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు.