భీమవరం: ఈనెల 20వ తేదీ నుంచి 24 వరకు భీమవరంలో జాతీయ సేవా పథక దినోత్సవం పై మీడియాతో మాట్లాడుతున్న కార్యక్రమ కన్వీనర్ రంగసాయి
ఈనెల 20వ తేదీ నుంచి 24 వరకు భీమవరంలో జాతీయ సేవా పథక (ఎన్ఎస్ఎస్) దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ కన్వీనర్ చెరుకువాడ రంగసాయి తెలిపారు. బుధవారం భీమవరంలో ఆయన మాట్లాడారు. ఐదు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో 23న పట్టణంలో ర్యాలీ, 24న 26 మంది ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లకు అవార్డులు అందిస్తామని, విద్యార్థులకు జాతీయ సమైక్యత శాంతి అహింసలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.