డుంబ్రిగుడా మండలం చాపరాయి జలవిహారికి పోటెత్తిన పర్యటకులు-కేరింతలు కొట్టిన పర్యటకులు
వరుసగా రెండురోజులు పాటు సెలవులు రావడంతో డుంబ్రిగుడా మండలంలోని చాపరాయి జలవిహారికి పర్యటకులు పోటేత్తారు. ఆదివారం ఉదయం నుంచే పర్యటకులు చాపరాయి జలవిహారి వద్దకు బారులు తీరారు. ఆదివారం సాయంత్రం వరకూ పర్యాటకులు రాకపోకలు సాగించారు. ఈ సందర్బంగా పర్యటకులు చాపరాయి వద్ద కేరింతలు కొడుతూ సందడి చేశారు.