జనగాం: జనగామలో పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పించిన డీసీపీ
జనగామ జిల్లా కేంద్రంలోని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఘన నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీఐ, ఎస్సైలు మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.