గుంతకల్లు: బాణసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి, గుంతకల్లు అగ్నిమాపక శాఖ అధికారి అశ్వర్థ
పట్టణంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బాణాసంచా దుకాణాల వద్ద నిబంధనలు తప్పకుండా పాటించాలని గుంతకల్లు అగ్నిమాపక శాఖ అధికారి అశ్వర్థ హెచ్చరించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలను శనివారం అగ్నిమాపక శాఖ అధికారులు తనిఖీ చేశారు. దుకాణాల వద్ద అగ్ని భద్రతా మార్గదర్శకాలు పాటిస్తున్నారా లేదా అని దుకాణాలను పరిశీలించారు. దుకాణాలు ఏర్పాటు చేసిన వారి లైసెన్స్ తాత్కాలిక కాలానికి మాత్రమే చెల్లుతుందని అగ్నిమాపక శాఖ అధికారి వివరించారు. దీపావలి సమయానికి మూడు రోజులు మాత్రమే లైసెన్స్ చెల్లుతుందన్నారు. దుకాణదారులు బాణసంచా నిల్వ లేదా తయారీ చేయరాదన్నారు.