శాతవాహన ఎక్స్ప్రెస్ లో నుంచి జారిపడి మృతి చెందిన కర్మాకర్ అనే వ్యక్తి
వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలోని చింతలపల్లి ఏలూరు రైల్వే స్టేషన్ల మధ్య శాతవాహన ఎక్స్ప్రెస్ నుండి జారిపడి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కు చెందిన లాభాను కర్మాకర్ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు విజయవాడ నుండి వరంగల్ కు ప్రయాణం చేయుచుండగా మార్గమధ్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలోని చింతలపల్లి ఏలూరు రైల్వేస్టేషన్లో మధ్య ప్రమాదవశాత్తు ట్రైన్ నుండి జారిపడి తలకు మరియు ఇతర శరీర భాగాలకు తీవ్రమైన గాయాలు ఐ అక్కడికక్కడే మృతి చెందినట్లు రైల్వే పోలీసులు శనివారం రాత్రి పది గంటలకు ప్రెస్ నోట్ లో తెలిపారు.