దర్శి: తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని నిర్వహణ
Darsi, Prakasam | May 16, 2025 తాళ్లూరు మండలం లోని తూర్పు గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రజలు ఎల్లప్పుడూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ శ్రీకాంత్ కోరారు. తినే వస్తువులపై మూతలు వేసుకోవాలని, వేడిగా ఉన్న పదార్థాలను తినాలని, దోమలు నివారణకు తప్పనిసరిగా దోమ దారులను వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మౌనిక, ANM అనిత, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.