ఆళ్లగడ్డ: శోభా నాగిరెడ్డి సేవలు చిరస్మరణీయం: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ దివంగత నేత భూమా శోభా నాగిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా శుక్రవారం భూమా ఘాటు వద్ద ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, యువ నాయకులు భార్గవ్ రామ్, భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ భూమా శోభా నాగిరెడ్డి ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన మహానేత అని పేర్కొన్నారు, ఆమె సేవలు ఎల్లప్పుడూ ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయని అన్నారు. పేదల అభ్యున్నతి,అభివృద్ధి కోసం ఆమె చేసిన సేవలు ఆదర్శప్రాయమని, ఆమె ఆశయాలను కొనసాగించడం తమ బాధ్యత అని తెలిపారు, యువత ఆమె చూపిన మార్గంలో నడిచి సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు,