నంద్యాల అర్బన్: నంద్యాల పర్యటనకు వచ్చిన షెడ్యూలు కులాల కమిషన్ చైర్మన్ జవహర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 2, 2026
నంద్యాలలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో, రాష్ట్ర షెడ్యూల్ కులాల (SC) కమిషన్ ఛైర్మన్ కె.ఎస్. జవహర్ మంగళవారం కలెక్టర్ రాజకుమారి గణియాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మొక్కను బహూకరించి కలెక్టర్ స్వాగతం పలికారు. అనంతరం జరిగిన చర్చలో, జిల్లాలో షెడ్యూల్ కులాల అభివృద్ధికి తగిన ప్రోత్సాహం అందిస్తామని, వారి సంక్షేమానికి మరియు సర్వతోముఖాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నారు.