బాల్కొండ: రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి: బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు ఎకరానికి 30వేల రూపాయలు నష్టపోతున్నారు. రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలన్నారు. వేల్పూరు గ్రామంలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ వ్యాపారులు రెండు వేల రూపాయలకు మొదట కొని తర్వాత తగ్గిస్తూ ఇప్పుడు 1800 కూడా కొనడం లేదన్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. m