రాప్తాడు: ఆర్డిటి క్రీడా మైదానంలో ఏడవ రాష్ట్రస్థాయి రెవిన్యూ క్రీడలు సాంస్కృత ఉత్సవాలను ప్రారంభించిన స్పెషల్ సీఎస్ జయలక్ష్మి
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఉప్పరపల్లి వద్ద ఆర్డిటి క్రీడా మైదానంలో శుక్రవారం 10:30 సమయంలో రాష్ట్ర సీసీఎల్ఏ అండ్ స్పెషల్ సిఎస్ జయలక్ష్మి ఏడవ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా స్పెషల్ సీఎస్ జయలక్ష్మి మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు 24 గంటల పాటు విధినిర్వహణలో ఉంటారని ఇటువంటి వారికి మూడు రోజులు పాటు క్రీడలు సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం ఆనందంగా ఉందని రాష్ట్ర స్పెషల్ సీఎస్ జయలక్ష్మి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ రెవెన్యూ ఉద్యోగ సంఘం నేతలంతా పాల్గొన్నారు.