రాప్తాడు: RDT కి ఎఫ్ సి ఆర్ ఏ వచ్చేవరకు పోరాటమే అనంతపురంలో రాప్తాడు నియోజకవర్గం ఏపీ ఎమ్మార్పీఎస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దాస్
అనంతపురం జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బి బంగ్లా నందు బుధవారం 11:50 నిమిషాల సమయంలో రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దాస్, ఎస్సీ ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు హరి, మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎమ్మార్పీఎస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దాస్ మాట్లాడుతూ సెప్టెంబర్ 15న దళిత సంఘాల ఆధ్వర్యంలో సేవ్ ఆర్డిటి పులి కేక కార్యక్రమంలో వందలాది మంది దళితులు దళిత సంఘ నేతలంతా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది అని భవిష్యత్తులో ఆర్డిటి కి, ఎఫ్ సి ఆర్ ఏ రెన్యూవల్ వచ్చేవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తామని రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ దాస్ పేర్కొన్నారు.