నంద్యాల అర్బన్: నంద్యాల ఆర్జీఎం కళాశాల బస్సు డ్రైవర్ కు గుండెపోటు, పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు,తప్పిన పెను ప్రమాదం
Nandyal Urban, Nandyal | Apr 25, 2026
నంద్యాల జిల్లా మిడ్తూరు మండలం జలకనూరు బాట వద్ద శనివారం ప్రమాదం జరిగింది. నంద్యాలకు చెందిన ఆర్ జి యం కళాశాల బస్సు నడుపుతుండగా డ్రైవర్కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వాహనం అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన విద్యార్థులు అప్రమత్తమై బస్సు నుంచి కిందకు దూకేశారు. ఆస్పత్రికి తరలించే లోపే డ్రైవర్ మృతి చెందినట్లు విద్యార్థులు తెలిపారు.