ఇస్సాయిపాలెం గ్రామం వద్ద వర్షానికి నేలకొరిగిన భారీ వృక్షం
పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నరసరావుపేట మండలం ఇస్సాయిపాలెంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఒక భారీ వృక్షం నేల కూలింది. రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి ఈ చెట్టు కూలిందని స్థానికులు ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో తెలిపారు. అదృష్టవశాత్తు చెట్టు రోడ్డుపై పడకుండా ఒక వైపుకు వరగడంతో పిలుపు ప్రమాదం తప్పిందని లేకపోతే భారీ ప్రమాదం జరిగి ఉండేది అంటూ స్థానికులు తెలియజేశారు.