ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా దర్శిలో టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో శనివారం భారీ తిరంగా యాత్ర నిర్వహించారు. వంద అడుగుల జాతీయ పతాకంతో చేపట్టిన ర్యాలీలో భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలు మార్మోగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.