తాడిపత్రి: తాడిపత్రి పట్టణంలో మరోసారి వేడెక్కిన రాజకీయం, మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసుల భారీ బందోబస్తు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ 'ప్రజా ఉద్యమం' కార్యక్రమానికి ఇవాళ సిద్ధమైంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సైతం కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరగా.. ఆయనను ఇంటి వద్ద పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పోలీసులు పోలీసులు జాగ్రత్తలు చేపట్టారు అడగడుకున్న పహారా కాశారు.