మదనపల్లి పట్టణంలో ఉరివేసుకొని మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్య
మదనపల్లిలో మహిళా పోలీస్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటన సంబంధించి మదనపల్లి టూ టౌన్ సిఐ రామచంద్ర ఏఎస్ఐ రమణ తెలిపిన వివరాల మేరకు నిమ్మనపల్లి రోడ్డు లోని విద్యోదయ స్కూల్ వద్ద కాపురం ఉంటున్న ఓ ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్ రవికుమార్ భార్య రెడ్డి రోజా 35 పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం పారపటల్లో మహిళా కానిస్టేబుల్ గా పనిచేస్తుంది ఈమె మదనపల్లిలో ఉంటున్న ఇంటిలో శనివారం రాత్రి చున్నీతో ఉరివేసుకొని మృతి చెందింది పెళ్లి 15 సంవత్సరాలు అయినా పిల్లలు లేకపోవడంతో తీవ్ర మనస్థాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.