ఆళ్లగడ్డలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు ఆధ్వర్యంలో విద్య అవకాశాలపై సమీక్ష
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మాదిగ సామాజిక వర్గంలో స్కూలుకు వెళ్లే విద్యార్థుల డ్రాప్ అవుట్స్ తగ్గించి విద్య ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకోవాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ పిలుపునిచ్చారు, ఆళ్లగడ్డ పట్టణంలో మంగళవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు, 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట వర్గీకరణ ఫలితాలను మాదిగలు సంపూర్ణంగా అందుకునేందుకు గో టు విలేజ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు, ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు