బనగానపల్లె: బనగానపల్లెలో పొగాకు పోస్టర్ను తొలగించండి : ఐ హెచ్ ఆర్ ఎస్ జిల్లా యూత్ అధ్యక్షుడు చందు
వేలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు, చిన్నపిల్లలు వచ్చే ప్రదేశాల్లో పొగాకు, గుట్కా, తంబాకు ప్రకటనలు కనిపించడం యువతపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని IHRF జిల్లా యూత్ అధ్యక్షుడు చందు వాపోయారు. బనగానపల్లె బస్టాండ్ ఆవరణలో ఉన్న పొగాకు ప్రకటనల బ్లానర్లను తొలగించాలని కోరారు. 'పొగాకు ఆరోగ్యానికి హానికరం' అనే అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.