నంద్యాల అర్బన్: నంద్యాల- గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్ లో తప్పిన ప్రమాదం
Nandyal Urban, Nandyal | Apr 3, 2026
నంద్యాల-గిద్దలూరు రహదారిలోని నల్లమల ఘాట్ రోడ్డులో శుక్రవారం పెను ప్రమాదం తప్పింది. గిద్దలూరు నుంచి నంద్యాలకు వస్తున్న లారీ దిమ్మల వద్ద ప్రహరీ గోడను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మహానంది రోడ్డు విభాగం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.