ఉరవకొండ: జ్వాలా తోరణం దర్శనానికి పోటెత్తిన భక్తజనం
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ రామేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం రాత్రి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన జ్వాలా తోరణం దర్శనానికి భక్తజనం పోటెత్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పార్వతీ పరమేశ్వరులకు కల్యాణోత్సవాన్ని నిర్వహించిన అనంతరం జ్వాలాతోరణం ఏర్పాటు చేశారు. ఆలయం ఏర్పాటు చేసిన దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ రామేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద సేవ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాద కార్యక్రమాలను నిర్వహించారు.