మిర్యాలగూడ: రైతు సంక్షేమం కోసం విరాళంగా సీఎంకు రూ.2 కోట్ల చెక్కును అందజేసిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి పాలాభిషేకం
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద ఆదివారం సాయంత్రం రైతు సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డికి రూ.2 కోట్ల చెక్కును విరాళంగా అందజేసిన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తన కుమారుడి రిసెప్షన్ కి అయ్యే ఖర్చును రైతుల కోసం వినియోగించాలని ఆయన నిర్ణయించినట్లు చెప్పారు. విరాళంగా అందజేసిన మొత్తాన్ని తన నియోజకవర్గ రైతులకు వినియోగించాలని సీఎంను కోరినట్లు తెలిపారు.