అమీర్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్ పరిధి బీరంగూడ ప్రాంతంలో డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారం మేరకు ఎస్టీఎప్ సీ టీమ్ ఎస్సై మంజు తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. నిందితుల నుంచి 1.4 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తొట హన్మంతు, ప్రణయ్ సుకుమార్‌ను అరెస్టు చేశారు. స్కూటీ, సెల్ ఫోన్లు, పట్టుబడ్డ డ్రగ్స్‌ను అమీర్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్ అప్పగించారు