ఒంగోలు అర్బన్: ఈ సంవత్సరం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి నీటిని అందించాలి : సీఎం చంద్రబాబు నాయుడు
Ongole Urban, Prakasam | May 7, 2026
మూడు జిల్లాల ముచ్చటైన కల వెలుగొండ ప్రాజెక్టుకు 30 సంవత్సరాల క్రితం తానే శంకుస్థాపన చేశానని ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితులలో పూర్తిచేసి తాగు సాగు నీటిని అందించాలని గురువారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నాడు ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిరంతర పర్యవేక్షణతో పాటు సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు 571 కోట్ల రూపాయలతో లైనింగ్ వర్క్స్ పూర్తి చేశామని త్వరలోనే మిగతావి కూడా పూర్తి చేసి ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితులలో నీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు